Telangana

రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా రుద్రారం జిల్లా పరిషత్ పాఠశాల

16 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో నూతన భవనం , మౌలిక వసతులు 

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు 

కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉచిత విద్య 

పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్రంలోనే రుద్రారం గ్రామ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను 16 కోట్ల రూపాయల సి ఎస్ ఆర్ నిధులతో ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దబోతున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.బుధవారం పటాన్‌చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామ పరిధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఎంవైకె లాటిక్రేట్ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్మాణ ప్లాన్, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రారం గ్రామ పరిధి నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల,. అంగన్వాడి పాఠశాల భవనాలను ఆధునిక సాంకేతికతో నిర్మించబోతున్నట్లు తెలిపారు.

ఎంవైకె లాటిక్రేట్ పరిశ్రమ సహకారంతో 16 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ కృతిక ద్వారా ఆధునిక వసతులతో నిర్మించనున్నట్లు తెలిపారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మూడు ఎకరాల 34 గంటల స్థలంలో 43,378 చదరపు అడుగుల విస్తీర్ణంతో 15 తరగతి గదులు, మండల పరిషత్ పాఠశాలను ఒక ఎకరా 23 గుంటల స్థలంలో 26,586 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 తరగతి గదులు నిర్మించబోతున్నట్లు తెలిపారు. వీటితోపాటు ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ కోర్టులను నిర్మించబోతున్నట్లు తెలిపారు.

గ్రామంలోని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించేలా పాఠశాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గ్రామంలోని తల్లిదండ్రులు పాఠశాల బృందానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.త్వరితగతిన పాఠశాల నిర్మాణం పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాండు, మాజీ ఎంపీటీసీలు రాజు, హరి ప్రసాద్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వర్ నాయక్, ఎంవైకె లాటిక్రేట్ సంస్థ ప్రతినిధి రోహిత్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago