భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం:

పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తెల్లాపూర్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల సంఘం తెల్లాపూర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఈ నేపథ్యంలో భవన నిర్మాణ రంగ కార్మికుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంఘం కోసం అతి త్వరలో స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలోనూ తగు ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అసోసియేషన్ తరపున ప్రతి కార్మికుడు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, శ్రీశైలం, దయాకర్, శ్రీ పాల్ రెడ్డి, నాగరాజు, సాగర్, హర్ష, ఇంద్రారెడ్డి, సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *