Hyderabad

శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఖాతాలో 21 వ అవార్డ్

రామచంద్రపురం:

శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఖాతాలో 21 వ అవార్డ్ రావడం చాలా సంతోషంగా ఉందని శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం అన్నారు. కరోనా కష్టకాలంలో , లాక్ డౌన్ సమయంలో చేసిన సేవలను గుర్తించి అవార్డులను అందుకోవడం తమకు మరింత బాధ్యత పెరిగిందన్నారు.ఆదివారం కింగ్ కోటి లోని తెలంగాణ తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో  ముఖ్య అతిథిగా కేంద్ర అధికార ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ డాక్టర్ ఎస్ వేణుగోపాల చారి గారి చేతుల మీదుగా నంది అవార్డును అందజేశారు ముందు రోజుల్లో శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఆత్మవిశ్వాసంతో, బాధ్యతతో నిర్వర్తిస్తామని సేవలో వుండే మానసిక పునరుత్తేజానికి నాంది పలుకుతూ కార్యక్రమాలు వుంటాయని శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం తెలిపారు

 

అలాగే . ఆర్ కే కళ సంస్కృతి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రంజిత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామని ,లాక్ డౌన్ సమయంలో అర్థకలితో బాధపడుతున్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మాస్కులు, నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. శ్రీ బాలాజీ ఫౌండేషన్ కు మొదటి నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించినటువంటి ఆత్మీయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు .రాబోయే రోజుల్లో శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఆత్మవిశ్వాసంతో, బాధ్యతతో నిర్వర్తిస్తామన్నారు. సామాజిక సేవలో తమ వంతు సాయంగా అందించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని తెలిపారు .తాను పుట్టి పెరిగిన రామచంద్రపురం పట్టణ ప్రజలకు ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు బలరాం తెలిపారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago