_జై తెలంగాణ నినాదాలతో మార్మోగిన మైత్రి స్టేడియం
_ఎగిరిన జాతీయ జెండాలు.. వెళ్లి వెరిసిన సమైక్యతా స్ఫూర్తి
మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు స్థానిక పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పటాన్చెరు పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగాయి.వేలాదిమంది విద్యార్థులు, మహిళలు, ప్రభుత్వ శాఖల సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధులు, సబ్బండ వర్గాల ప్రజలు జాతీయ జెండాలను చేత బూని సమైక్యత స్ఫూర్తిని చాటిచెప్పారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్ నుండి వందల బుల్లెట్లతో,.జాతీయ జెండాలతో మైత్రి స్టేడియం వజ్రోత్సవ ర్యాలీ నిర్వహించారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి విద్యార్థులు, మహిళా సంఘాలు, ప్రభుత్వ శాఖల సిబ్బంది తో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్వయంగా జాతీయ జెండాను చేత బూని బుల్లెట్ పై తిరుగుతూ అందర్నీ ఉత్సాహపరిచారు.అనంతరం మైత్రి స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణను.. బంగారు తెలంగాణగా నిర్మించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సఫలీకృతులయ్యారని అన్నారు. అన్ని వర్గాల ఆర్థిక అభ్యున్నతి ధ్యేయంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికి దిక్సూచిగా తీర్చిదిద్దారని అన్నారు.
గంగ జమునా తేహజీబ్ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మత కల్లోలాలను రెచ్చగొడుతూ, పచ్చని తెలంగాణను విచ్చిన్నం చేసేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులని, మతతత్వ రాజకీయాలకు పాల్పడుతున్న బిజెపికి చరమగీతం పాడుతారని అన్నారు.ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులచే నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థినీ విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…