_మోడీ మొండివైఖరి పై వెల్లువెత్తిన నిరసన
_పటాన్చెరులో నల్లజెండా ఎగురవేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పండిస్తున్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో రైతులు, వ్యవసాయ కూలీలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ తమ ఇళ్ల పై నల్ల జెండాలను ఎగురవేసి నిరసనను వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నల్ల జండా ఎగరవేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండిస్తున్న చివరి ధాన్యం గింజ కొనుగోలు చేసేంత వరకు నిరంతర పోరాటాలు కొనసాగుతునే ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…