మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు మాజీ జేడ్పీటీసి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. స్వామి వివేకానంద 164వ జయంతినీ పురస్కరించుకొని పటాన్ చిరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో వివేకానంద యూత్ వారి ఆధ్వర్యంలో పాల్గొని వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమయినట్లే,ఆదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే” ఇలాంటి ఎన్నో సూక్తులు యువతకు అందించిన గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద గారు అని అయిన కొనియాడారుప్రపంచ పటంపై భారత ఆధ్యాత్మిక కీర్తి పతాకాన్ని ఎగరవేయడంతోపాటు దేశ యువతలో ఎంతో స్ఫూర్తిని రగిలించారు వివేకానందుడు. దేశ యువత ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో? ఆయన స్పష్టంగా తెలియజేశారు. వివేకానందుడి మాటలు, సూక్తులు ఇప్పటికీ, ఎప్పటికీ యువతకు మార్గనిర్దేశనం చేస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వివేకానంద యువజన సభ్యులు నవీన్,సంపత్,డప్పు ప్రశాంత్,డేగల నరేష్,మాజీ ఎంపీటీసీ నరేందర్ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్ విష్ణు వర్ధన్ రెడ్డి,బ్యాగరి వెంకటేష్,అడ్వకేట్ నాగరాజు,మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…