డిజిటల్ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి – బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ తెలిపారు .బుధవారం పటాన్‌చెరు పట్టణంలోని పీవీ నరసింహ ఆడిటోరియంలో బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. అనంతరం మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ పార్టీ సూచనల మేరకు డివిజన్ పరిధిలోని ప్రతి బూత్ స్థాయిలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో స్పీడ్ పెంచాలని కోరారు. పార్టీ అధిష్ఠానం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బూత్ స్థాయి నుంచి విస్తృతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి బూత్‌కు ఇద్దరు యువ కార్యకర్తలు, ఒక బూత్ బాధ్యుడిని నియమించి ప్రత్యేక డిజిటల్ సభ్యత్వ నమోదు అనువర్తనం ద్వారా భారీ సంఖ్యలో సభ్యత్వాలను నమోదు చేయాలని సూచించారు. ప్రజలతో మరింత మమేకమై పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రజలతో పార్టీకి ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా మలచాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ గారు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ , నర్రా భిక్షపతి , శ్రీధర్ చారి , వంగారి అశోక్ , చందు , గుండమొల్ల రాజు , కోమరగూడెం వెంకటేష్ , నవీన్ రెడ్డి , శంకర్ , షకీల్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు యంపీ ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *