Telangana

యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన పి పి ఆర్ వాలీబాల్ టోర్నమెంట్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

నేటి తరం యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. పటాన్చెరు మండలం భానురు గ్రామంలో ఏర్పాటు చేసిన పి పి ఆర్ వాలీబాల్ టోర్నమెంట్ ను శనివారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ లాంచనగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని తెలిపారు. నేటి ఆధునిక జీవనశైలిలో యువత ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలకే పరిమితం కాకుండా క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవర్చుకోవాలని సూచించారు.క్రీడా స్ఫూర్తి యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావనను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా క్రీడ మైదానాలు ఏర్పాటు చేయడంతో పాటు వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తూ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. క్రీడా సదుపాయాలను సద్వినియోగం చేసుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని కోరారు. ప్రతి విద్యార్థి తన రోజువారీ జీవితంలో కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కృష్ణ యాదవ్, శ్యాంసుందర్ రెడ్డి, క్రీడాకారులు, క్రీడా పోటీల నిర్వాహకులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago