-వైద్యం అందరికీ అందుబాటులో కొస్తేనే దేశాభివృద్ధి సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య
-సిఐటియు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు:
స్వతంత్ర పోరాట యోధుడు, విప్లవ వీరుడు నవతరానికి స్ఫూర్తి అయినా భగత్ సింగ్ ను యువతి, యువకులు ఆదర్శంగా తీసుకోవాలని ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోటా అన్నారు. పటాన్ చెరు పట్టణం లోని శ్రామిక్ భవన్ లో సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆమేధా ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ శిబిరాన్ని ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోటా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు అనంతరం జరిగిన సమావేశంలో కార్తీక్ మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయాలను యువతి యువకులు ముందుకు తీసుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. భగత్ సింగ్ ఆశయాల కోసం అందరూ ఆలోచించాలని, చైతన్యం కావాలన్నారు.స్వతంత్రం కోసం చిన్న వయసులోనే ఉరితాడుతో ఊయలు లూగిన వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు ఆనాడు స్వతంత్రం కోసం పోరాడి ప్రాణ త్యాగాలు చేసిన వేల పదిమంది ఆశయాలు ఈరోజు వరకు కూడా నెరవేరట్లేదని స్వతంత్రం దేశ ములో ప్రజల సమస్యల పరిష్కారానికి నోచుకోకపోవడం దారుణమన్నారు.
స్వతంత్ర పోరాట ఫలాలు అందరికీ అందే వరకు యువతీ యువకులు ఉద్యమాలకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పెట్టుబడిదారులు బడా పెట్టుబడుదలగా మారుతున్నారని ఆయన అన్నారు పేదలు మరింత పేదలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్రం కోల్పోయే ప్రమాదంలో దేశం ఉందని దీనిని ప్రజలందరూ గమనించాలని,స్వతంత్ర పోరాట ఫలాలు అందరికీ అందే వరకు ఉద్యమాలకు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన యువతీ యువకులకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ పెంటయ్య, సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య మాట్లాడుతూ విద్య వైద్యం పేదలందరికీ పాలకులే ఉచితంగా అందించాలని ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని అటువైపు అందరూ ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే దేశం ముందుకు పోతుందని దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ఉత్పత్తి జరుగుతుందని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యం, నాగేశ్వరరావు, అర్జున్, సురేష్, రామకృష్ణ, సిఇ బాబు, నర్సింలు అమేధా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…