Telangana

గీతంలో పరిశోధనా పద్ధతులపై కార్యశాల

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సౌజన్యంతో ఏర్పాటు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ సోషల్ సైన్సెస్ లో ‘పరిశోధనా పద్ధతుల’పై పదిరోజుల కార్యశాలను ఈనెల 4 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారికి అత్యుత్తమ పరిశోధనలు చేపట్టడానికి అవసరమైన జ్జానం, నైపుణ్యాలు పెంపొందించేందుకు లక్షించారు.సమర్థవంతమైన పరిశోధన ప్రణాళిక, అమలు, విశ్లేషణకు సంబంధించి సమగ్ర అంతర్దృష్టులతో పరిశోధకులు, విద్యావేత్తలు, నిపుణులను శక్తివంతం చేయడానికి ఈ కోర్సును రూపొందించారు. ఇందులో పాల్గొనేవారు క్రమబద్దమైన సాహిత్య సమీక్షలు, పరిశోధన రూపకల్పన, డేటా సేకరణ, విశ్లేషణ పద్ధతులు, నైతిక పరిశీలనలు, అవసరమైన సాఫ్ట్ వేర్ సాధనాలతో ఆచరణాత్మక శిక్షణ పొందుతున్నారు.పరిశోధనను బాధ్యతాయుతంగా నిర్వహించడం, వివిధ రకాల సమాచార విశ్లేషణ, పరిశోధనా రూపకల్పన, సాంకేతిక శిక్షణ, నమూనా పరిణామం నిర్దారణ, అనులేఖనం, సమాచర సేకరణ వివరాలు పొందుపరచే విధానాలపై సదస్యులకు మంచి అవగాహన ఏర్పరచనున్నారు.

పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు చెందిన నిపుణులు ఈ కార్యశాలలో వక్తలుగా పాల్గొని తమ అనుభవాలు, పరిశోధనా పద్ధతులపై పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్నారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజ్ నుంచి ప్రొఫెసర్ ఆర్.కె.మిశ్రా, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్, ఓపీ జిందాల్ గ్లోబల్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ రూపేష్ కుమార్, సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటికి చెందిన డాక్టర్ శివోహం సింగ్, వీఎన్ఆర్ విజ్జాన జ్యోతి ఇన్ స్టిట్యూట్ నుంచి డాక్టర్ నిత్య సుందర్ నందా వంటి పలువురు విద్యావేత్తలు ప్రధాన వక్తలుగా ఆయా ఎంపిక చేసిన అంశాలపై ప్రసంగిస్తూ, పరిశోధక విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు.

మనదేశంలోని పలు ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు చెందిన దాదాపు 30 మంది పరిశోధక విద్యార్థులు ఈ కార్యశాలలో పాల్గొని, తమ పరిశోధనా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు తగిన నైపుణ్యాలను అలవరచుకుంటున్నారు.ఈ కోర్సు సహ సంచాలకుడు డాక్టర్ మనోజ్ కుమార్ పర్యవేక్షణలో, డాక్టర్ కె.రఖా, డాక్టర్ శోభా మిశ్రాలు సమన్వయం చేస్తున్నారు. ఈ కోర్సు కేవలం నేర్చుకునే మెథడాలజీల గురించి మాత్రమే కాకుండా నైతిక పరిశోధన పద్ధతులు, మెథడాలాజికల్ కఠినత యొక్క సంస్కృతిని పెంపొందించడం గురించి కూడా విశదపరుస్తోందని కార్యశాల డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా తెలియజేశారు. సాంఘిక శాస్త్రాల రంగానికి అర్థవంతంగా దోహదపడే తదుపరి తరం పరిశోధకులను అభివృద్ధి చేయడానికి ఇది ఉపకరిస్తుందన్నారు. వచ్చే గురువారం ఈ కార్యశాల ముగింపు వేడుక నిర్వహించి, ఆసక్తిగా పాల్గొన్నవారికి ప్రశంసా పత్రాలను పంపిణీ చేయనున్నారు.

admin

Recent Posts

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎస్ఐఆర్‌లో పాల్గొనండి.. పటాన్‌చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.…

8 hours ago

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

20 hours ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

20 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

20 hours ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

20 hours ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

2 days ago