పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హెదరాబాద్ (జీఎస్బీ); నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) అకాడమీలు సంయుక్తంగా ఈనెల 31 తేదీన ‘ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ అండ్ కంప్యూటేషనల్ ఫైనాన్స్ యూజింగ్ పెథాన్ అండ్ ఆర్’ పై రెండు రోజుల వర్చువల్ వర్క్షాపు నిర్వహించనున్నాయి. గతంలో అనివార్య కారణాల వల్ల వాయిదాపడిన ఈ వర్క్షాప్ను తిరిగి ఈ నెలాఖరున నిర్వహించనున్నట్టు జీఎస్బీ ఫైనాన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఆర్. రాధిక మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనేవారి నైపుణ్యాలు, సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ఈ వర్క్ ప్ లక్ష్యమన్నారు. ఇందులో పాల్గొనే వారందరికీ అల్గారిథమిక్ ట్రేడింగ్ను పరిచయం చేయడంతో పాటు, వారిని నిజ-సమయ వ్యూహాలతో సన్నద్ధం చేయనున్నట్టు ఆమె వివరించారు.సిగ్నస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈవో ఎం.అరవింద్, క్యాపిటల్ మార్కెట్ ని ఎస్ఎంఈ ఎల్.కన్నన్, గీతం అధ్యాపకులు తను విస్తృతమైన ట్రేడింగ్ అనుభవంతో ఈ వర్క్షాపు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఆసక్తి గలవారు తమ పేర్ల నమోదు, ఇతర వివరాల కోసం డాక్టర్ ఎన్. రూపలత 98481 17823ని సంప్రదించాలని లేదా finghbsws21@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని ప్రొఫెసర్ రాధిక సూచించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…