Telangana

అభివృద్ధి… సంక్షేమం రెండు కళ్ళు – పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఒకే రోజు 23 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

– ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాం

రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి :

నూతనంగా ఏర్పడిన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో 23 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ శంకుస్థాపన చేశారు. మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే జీఎంఆర్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నారాయణఖేడ్ సభలో ప్రకటించిన 25 కోట్ల రూపాయల నిధులతోమున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న తెల్లాపూర్ మున్సిపల్ అన్ని రంగాల్లో దూసుకు వెళ్తోందని అన్నారు. ఇందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago