Telangana

యాదవుల సంక్షేమానికి కృషి

_ప్రజల నమ్మకంతోనే హ్యాట్రిక్ విజయం సాధించాం

_ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

యాదవుల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు, ఆర్థిక అభ్యున్నతికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ కాలనీలో గల గోకుల్ ఫంక్షన్ హాలులో పటాన్చెరు యాదవ సంఘం ఆధ్వర్యంలో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్నేతలని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసినప్పుడే విజయం సాధించడం సాధ్యమవుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాలకు ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago