Telangana

మహిళా సాధికారతే సమాజ పురోగతికి పునాది పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి లావణ్య మధునాల

అన్ని రంగాలలో ప్రత్యేకతను చాటుకుంటున్న నేటితరం మహిళలు

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతికగా నిలుస్తున్న చేనేత రంగం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

మహిళా సాధికారతే సమాజ పురోగతికి పునాదిరాళ్లని పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాలలో తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటు నేటి తరం మహిళగా నిలుస్తున్నారని పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి లావణ్య మధునాల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని బుధవారం పటాన్ చెరు పట్టణంలో పద్మశాలి మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ గీత వెంకట్ అధ్యక్షతన. జరిగిన సమావేశంలో లావణ్య మధునాల మాట్లాడుతు. చేనేత రంగంలో చేనేత మహిళల కృషి సంప్రదాయానికి అద్దం పడుతుందన్నారు. నేటికీ దేశంలో సంస్కృతి, సాంప్రదాయాలకు చేనేత రంగం ప్రతీకగా నిలుస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది మహిళలు నూలు వడకడం,బట్టలు నేయడం వంటి పనుల్లో నిమగ్నమై తమ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు నందిస్తున్నారన్నారు.చేనేత మహిళలు తమ నైపుణ్యం, శ్రమతో అందమైన వస్త్రాలను తయారు చేస్తూ సంప్రదాయ కళను నిలబెడుతున్నారని, వారి కృషి వల్ల చేతితో నేసిన వస్త్రాలకు దేశీయంగానే కాక అంతర్జాతీయంగాను మంచి గుర్తింపు లభిస్తోందని చెప్పారు. ప్రభుత్వం చేనేత మహిళలకు అవసరమైన మద్దతు, శిక్షణ మరియు మార్కెట్ అవకాశాలు కల్పిస్తే మరింత అభివృద్ధి చెందుతారని, శ్రమకు తగ్గ గౌరవం ఇవ్వడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అన్నారు.సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనదని,కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు మహిళలు తమ ప్రతిభ, కృషి, సహనంతో గొప్ప విజయాలను సాధిస్తున్నారని అందుకే ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు.మహిళా సాధికారతే సమాజ పురోగతికి పునాదని, ప్రతి మహిళకు సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యతగా గుర్తుతెరగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ఉపాధ్యక్షురాలు సంగీత, జి.చంద్రకళ, కె.చంద్రకళ, నర్సమ్మ తదితర మహిళలు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago