Telangana

రెండో రోజు కొనసాగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ క్రీడోత్సవాలు

రేపు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో వేలాది మంది మహిళలతో నియోజకవర్గస్థాయి మహిళా దినోత్సవ వేడుకలు.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని.. పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం వేదికగా ఏర్పాటు చేసిన మహిళా క్రీడోత్సవాలు రెండో రోజు ఘనంగా కొనసాగాయి. ఎమ్మెల్యే జిఎంఆర్ గారు గూడెం యాదమ్మ గారితో కలిసి స్వయంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా పటాన్చెరు పట్టణం వేదికగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిత్యం కుటుంబ నిర్వహణ, ఉద్యోగం వంటి బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా ఉండే మహిళల కోసం క్రీడోత్సవాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 12వ తేదీ గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గస్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలు, డివిజన్ల పరిధిలోని మహిళలందరూ వేడుకల్లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. క్రీడోత్సవాల్లో విజేతలుగా నిలిచిన వారందరికీ బహుమతులు అందించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు విజయ్ కుమార్, విజయ్ భాస్కర్ రెడ్డి, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, హారిక విజయ్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు, మహిళలు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago