_గీతం అధ్యాపకులతో టెలికాం నియంత్రణ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పీడీ వాఘేలా
_ప్రపంచంలో రెండో అతిపెద్ద టెలికాం రంగం ఇండియాదే
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతికత వల్ల మనం మరిన్ని సవాళ్లను ఎదుర్కోక తప్పదని, అది కొత్త ఉత్పత్తులతో రావడమే గాక అప్పటికే ఆ రంగంలో ఉన్నవారిని కలవరపెట్టడం ఖాయమని టె టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) చైర్మన్ డాక్టర్ సీడీ వాఘేలా అన్నారు. ట్రాయ్ కార్యదర్శి వి.రఘునందన్ తో కలిసి గీతం, హైదరాబాద్ అధ్యాపకులతో శుక్రవారం ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం పరిశోధనపై దృష్టి పెట్టకపోతే, అంతర్జాతీయ విలువ మార్పు వ్యవస్థలో ఇమడలేమని, ఈ వ్యవస్థలో భారత స్థానం అంత బలంగా లేదన్నారు. కమ్యూనికేషన్, ప్రసారాలలో ప్రాథమిక పరిశోధనలో మనం వెనుకబడ్డా, ఆచరణాత్మక పరిశోధనలో మాత్రం బలంగా ఉన్నట్టు చెప్పారు. ట్రాయ్ ప్రభుత్వం కాదని, కేవలం నియంత్రణ సంస్థ మాత్రమేనని, అయితే టెలికాం టారిఫ్ లను మార్కెట్ లోని సర్వీస్ ప్రొవైడర్లకే వదిలివేశామని, అందువల్లనే ప్రపంచంలోని చాలా దేశాలకన్నా తక్కువ ధరకు 170 కోట్ల మందికి మొబైల్ సేవలను అందించగలుగుతున్నట్టు సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వీలైన కొత్త సేవలు, కొత్త సర్వీస్ ప్రొవైడర్లు వచ్చినప్పుడు, తాము ప్రభుత్వానికి తగు సిఫారసులు చేస్తానున్నారు.
కృత్రిమ మేథ (ఏఐ) గురించి మాట్లాడుతూ, ఏఐలో సమగ్ర పర్యావరణ వ్యవస్థను ప్రతిపాదించిన ప్రపంచంలోని కొన్ని దేశాలలో మనమూ ఒకరమని చెప్పారు. ఇది విద్య, ఆరోగ్య రంగాలలో సహాయపడుతోందని, అపారమైన ప్రయోజనాలను కలిగి ఉందన్నారు. మనదేశం ఏఐ, ఆగ్ మెంట్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్) రోబోటిక్స్, యంత్రం నుంచి యంత్రంలోకి (ఎంఎల్) ప్రవేశించడం వంటి రంగాలన్నింటిలోకి భారత్ ప్రవేశిస్తోందని చెప్పారు. ఈ సాంకేతికల వల్ల కొన్ని ప్రతికూలతలున్నా, వాటిని అధిగమించి సానుకూలతతో సమతుల్యం చేయడానికి యత్నిస్తున్నామన్నారు. భారతదేశం డిజిటిల్ ఆర్థిక వ్యవస్థ మూడేళ్ల క్రితం నిరుత్సాహంగానే ఉన్నా, ప్రస్తుతం మొత్తం ఆర్థిక వ్యవస్థలో 15 శాతానికి చేరినట్టు హర్షధ్వానాల మధ్య డాక్టర్ వాఘేలా వెల్లడించారు. మరో ఐదు, పదేళ్లలో చెప్పుకోదగ్గ మార్పును చూడబోతున్నట్టు ఆయన విశ్వాసం వెలిబుచ్చారు. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెలికాం రంగం మనదని, తాము డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తొమ్మిది సమాంతర వ్యవస్థలైన కమ్యూనికేషన్, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్టు ప్రకటించారు.
అప్లికేషన్ల రూపంలో యూపీఐని ప్రజలకు అందుబాటులోకి తేవడం వల్ల ప్రపంచంలోనే 40 శాతం డిజిటల్ లావాదేవీలు మనదేశంలో జరుగుతున్నట్టు హర్షాతిరేకాల మధ్య వెల్లడించారు. ఈ యూపీఐని మరో ఇరవై దేశాలు అమలు చేస్తున్నాయన్నారు. మన డిజిటల్ టెక్నాలజీని సార్క్ ఆఫ్రికాతో పాటు ఐరోపా దేశాలకు కూడా అందజేస్తున్నట్టు వాఘేలా చెప్పారు. మనదేశం 4, 5, 6 సాంకేతికలను కూడా అభివృద్ధి చేసి ప్రపంచ నాయకత్వ స్థానంలో ఉండి, పలు దేశాల ఆదరాభిమానలను చూరగొంటోందని డాక్టర్ డీపీ వాఘేలా తెలిపారు. 4జీ సాంకేతిక వల్ల చిన్న విక్రేతలు కూడా స్కాన్ ద్వారా నగదు రహిత లావేదేవీలు చేసే వీలు కల్గిందన్నారు. అయితే ఇందులో కొన్ని లోటుపాట్లు లేకపోలేదని, చిన్న పాటి తప్పిదానికే మన ఖాతాలలోని నగదు కొల్లగొట్టి నిలుందని, దానిని సరిగా అరికట్టపోతే ఈ డిజిటల్ లావాదేవీల వైపు ప్రజలంతా మొగ్గు చూపరని ఆయన హెచ్చరించారు. 5జీ సాంకేతికతను చౌక ధరకు, అందరికీ అందుబాటులోకి వస్తే విద్యార్థులు, రైతులు, మత్స్యకారులకు ఎంతో ఉపయోగం కలుగుతుందని, ఇది ట్రాయ్ కు పెద్ద సవాలే అయినా, దాన్ని తాము పరిశోధిస్తున్నట్టు చెప్పారు.
రాబోయే ఐదేళ్లలో పౌరుల కోసం భారీ సంఖ్యలో సులువుగా వినియోగించుకోగలిగేలా చేయాల్సిన అవసరం ట్రాయ్ ఉందని చెర్మన్ తెలిపారు. తొలుత, ట్రాయ్ అత్యున్నతాధికారులు జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించి, ఆ తరువాత దక్షిణ కొరియ ప్రభుత్వ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఇండో-కొరియన్ ప్రొజెక్టు ఎండ్ టర్బెన్లను వారు సందర్శించారు.గీతం కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వీఆర్ శాస్త్రి, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తదితరులు ఆతిథులను స్వాగతించారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ వీకే శ్రీధర్ విండ్ టర్నెల్ ప్రాజెక్టు పరిశోధన, దాని పురోగతి గురించి వివరించారు. ఆర్కిమెడిస్ గ్రీన్ ఎనర్జీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సూర్య ప్రకాశ్ గజ్జలు కూడా ట్రాయ్ బృందంతో పాటు వచ్చారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…