-పెన్నార్ కార్మికులకు అండగా బి ఆర్ టి యు
-మెరుగైన వేతన ఒప్పందం అందించాం
-అరచేతిలో స్వర్గం చూపిస్తున్న యూనియన్లను తిప్పికొట్టండి
-పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పెన్నార్ పరిశ్రమలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి కార్మికుడికి అండగా నిలుస్తూ మెరుగైన వేతన ఒప్పందం అందించడం తోపాటు రాబోయే రోజుల్లో మరిన్ని హక్కులు సాధించేందుకు కృషి చేస్తున్న బి ఆర్ టి యు యూనియన్ ను గెలిపించాలని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బి ఆర్ టి యు (పెన్నార్ ఇండస్ట్రీస్) సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా పరిశ్రమ గుర్తింపు కార్మిక సంఘంగా బి ఆర్ టి యు యూనియన్ కార్మికుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తూ వారి మన్ననలు పొందడం జరిగిందని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు పరచడంతో పాటు సీటీసి లేకుండా వేతన ఒప్పందం, పెండింగ్ సమస్యలను పరిష్కరించడం, మెడికల్ ఇన్సూరెన్స్ పరిమితిని రెండు లక్షల రూపాయల నుండి మూడు లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందని తెలిపారు. త్వరలో జరగనున్న కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో గంట గుర్తుపై ఓటు వేసి బి ఆర్ టి యు యూనియన్ నీ గెలిపిస్తే.. అందరికీ ఆమోదయోగమైన వేతన ఒప్పందం, ప్రశాంత వాతావరణంలో విధుల నిర్వహణ, హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితిని ఐదు లక్షల వరకు పెంచడం, శాశ్వత ఉద్యోగ నియామకాలను పెంచడం, న్యాయబద్ధంగా యాజమాన్యం నుండి కార్మికులు రావాల్సిన బెనిఫిట్స్ అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో బిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు, యూనియన్ అధ్యక్షులు రాంబాబు యాదవ్, బి ఆర్ టి యు రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, పాండు, కార్మిక సంఘం ప్రతినిధులు ఎన్ వి రావు, లక్ష్మారెడ్డి, సోమేశ్వర్, పెంటయ్య, వెంకటేశ్వర్లు, మహేష్, జానకిరామ్, రామ్ మోహన్ రావు, శ్రీ రామ్ సింగ్, బి వి రావు, భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…