Telangana

కొత్త పింఛన్లకు మోక్షం ఎప్పుడు? నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షులు తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

కొత్త పింఛన్లకు మోక్షం ఎప్పుడని నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షులు తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 30 నెలలు పూర్తవుతున్నా, సామాజిక భద్రతా పింఛన్ల విషయంలో కొత్తగా అర్హత పొందిన వేలాది మంది నిరుపేదలు ఇంకా ఎదురుచూపుల్లోనే ఉన్నారని ఎన్నికల సమయంలో సామాజిక పింఛన్లను పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదు. కనీసం కొత్తగా అర్హత పొందిన లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆ ప్రక్రియ పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు.ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించడంతో పాటు, “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక”లో కూడా కొత్త పింఛన్ల మంజూరును ప్రస్తావించారు. అలాగే రాష్ట్ర బడ్జెట్‌లో 2 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తామని ప్రకటించారు. అనంతరం మంత్రి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు అమలు చేస్తామని వెల్లడించారు. జూలై నెల ప్రారంభమైనా ఈ అంశంపై స్పష్టమైన అమలు కనిపించడం లేదని గత కొన్ని సంవత్సరాలుగా కొత్త పింఛన్ల కోసం సమర్పించిన అనేక దరఖాస్తులు మండల, మున్సిపల్ కార్యాలయాల్లో పెండింగ్‌లోనే ఉన్నాయిని అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర సామాజిక భద్రత అవసరమైన లబ్ధిదారులు తమ దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు . రాబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న అర్హులైన దరఖాస్తులను పరిశీలించి, కొత్త పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

admin

Recent Posts

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఎస్.వి.నూకరాజుకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…

2 days ago

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…

3 days ago

గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ

ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…

3 days ago