పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ హైదరాబాద్-విశాఖపట్టణంలు సంయుక్తంగా ‘ఆర్కిటెక్చరల్ ఫొటోగ్రఫీలో కెరీర్’ అనే అంశంపై మార్చి 5, 2023న (ఆదివారం) ఉదయం 11.00 నుంచి 12.30 గంటల మధ్య వెబినారు నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ వెల్లడించారు. తాము గత ఏడాది నుంచి వరుసగా నిర్వహిస్తున్న వెబినార్లలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఫొటోగ్రఫీలో అవార్డు గ్రహీత, శ్రీనాగ్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు బి.ఆర్.ఎస్. శ్రీనాగ్ ఈ వెలినార్లో ముఖ్య వక్తగా పాల్గొంటారని ఆయన తెలియజేశారు. ఆసక్తి ఉన్నవారు జూమ్ లింక్ http://suri.ileshjt, మీటింగ్ ఐడీ: 588 858 3609, పాస్వర్డ: GSoAHyd ద్వారా ఈ వెబినార్లో పాల్గొనవచ్చన్నారు. ఇతర వివరాల కోసం అసోసియేట్ ప్రొఫెసర్ కె.నాగేశ్వరరావు 98666 19639ను సంప్రదించాలని, లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ స్నిగ్ధా రాయ్ sroy2 @gitam. cluకు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.
జాతీయ సమైక్యతా శిబిరానికి నలుగురి ఎంపిక
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్కు చెందిన నలుగురు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) – వాలంటీర్లు ఈనెల 3 నుంచి 4వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపూర్, శ్రీ ఎ.ఎన్.కళాశాలలో నిర్వహించనున్న జాతీయ సమైక్యతా శిబిరానికి ఎంపికయ్యారు. బీటెక్ చదువుతున్న కె.సాయి. . రిత్విక్, కె.సార్షిక, బీఎస్సీ చదువుతున్న ఎస్. జశ్వంత్, కె.తనూజలు ఈ శిబిరానికి ఎంపికెనట్టు గీతం ఎన్ఎ.ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ పీ.ఏ.నాగేంద్రకుమార్ తెలియజేశారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…