Telangana

ట్రాఫిక్ రహిత సమాజం కోసం రాజీ లేని కృషి చేస్తాం – అరికపూడి గాంధీ

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :

కొండాపూర్ డివిజన్ పరిధిలోని వైట్ ఫీల్డ్ లో గల శ్రీ రామాలయం దేవాలయం నుండి అంజయ్య నగర్ వరకు నెలకొన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలపై డీసీ బాలకృష్ణ, ట్రాఫిక్ సిఐ సురేష్ మరియు జి హెచ్ ఎం సి ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైట్ ఫీల్డ్ కాలనీ వాసుల విజ్ఞప్తి మెరుకు మంగళవారం రోజు కాలనీ లో పాదయాత్ర నిర్వహించారు.వైట్ ఫీల్డ్ రామాలయం దేవాలయం నుండి అంజయ్య నగర్ వరకు నిత్యం ట్రాఫిక్ సమస్య తో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారుఅని, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై రోడ్డు విస్తరణ కై తీసుకోవాల్సిన చర్యల పై అధికారులతో కలిసి స్వయంగా నడుచుకుంటూ వెళ్ళి తెలుసుకున్నారు. సాఫ్ట్ వెర్ ఉద్యోగులు,పాఠశాలల కు, కళశాలలకు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, వాహన దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రోడ్డు ఆక్రమణ ల పై ఉక్కుపాదం తో తొలగిస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని,ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని పేర్కొన్నారు. వైట్ ఫీల్డ్ కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామనీ, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని,రోడ్లు, డ్రైనేజి, స్ట్రీట్ లైట్స్ మరియు ఇతర మౌలిక వసతుల పై అసోసియేషన్ సభ్యులతో చర్చించడం జరిగినది అని అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని, ఏ చిన్న సమస్య అయిన తన దృష్టికి గాని తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామన్నారు.

ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన పనులు పై అధికారులకు పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని,రోడ్డు మధ్యలో అడ్డంకిగా ఉన్న ఎలక్ట్రికల్ స్థంబాలను త్వరితగతిన స్థాన భ్రంశం చేయాలని, అవసరమున్న చోట రోడ్డు విస్తరణ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఈ ఈ. గోవర్ధన్, డి.ఈ. దుర్గాప్రసాద్, టౌన్ ప్లానింగ్ ఎసిపి. కరుణాకర్, టిపిఎస్ సంతోష్, డి ఈ.రూపదేవి, ఏ ఈ. మన్యం, ఎస్ ఆర్ పి కిరణ్ మరియు నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago