Categories: politicsTelangana

సంత్ సేవాలాల్ మహరాజ్ బోధనలు స్ఫూర్తిదాయకం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత బిఆర్ఎస్ దే

బిడిఎల్ లో సంత్ సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి 15 లక్షల రూపాయలు సొంత నిధులు

పటాన్ చెరు లో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని గిరిపుత్రులు, గిరిజనుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం భానూరు పరిధిలోని బిడిఎల్ లో సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయం నిర్మాణానికి పదిహేను లక్షల రూపాయల సొంత నిధులు అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో శనివారం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287 వ జయంతి ఉత్సవాలను అధికారికంగా ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం నుండి జిఎంఆర్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే జిఎంఆర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం బోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని అన్నారు. సామాజిక ఆర్థిక రాజకీయ ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో గిరిజనులకు పెద్ద పీట వేయడం జరిగిందని తెలిపారు. గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రత్యేకంగా ఉపకార వేతనాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి రంగంలోనూ గిరిజన బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం గర్వకారణమని అన్నారు.పటాన్‌చెరు నియోజకవర్గంలోని వెలిమెల, కొల్లూరు, రాళ్లకత్వ, ఐలాపూర్, కొత్తపల్లి తండాల పరిధిలో సొంత నిధులతో శ్రీ భవానీ మాత సేవాలాల్ మహారాజ్ దేవాలయాలను నిర్మించామని గుర్తు చేశారు.

జయంతులు, వర్ధంతుల సమయాల్లోనే మహనీయుల సేవలను గుర్తించుకోవడం కాకుండా నిరంతరం వారి నుండి స్ఫూర్తి పొంది ముందుకు కొనసాగాలని సూచించారు.భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం మానవజన్మ అని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆ జన్మకు పరిపూర్ణత లభిస్తుందన్నారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం ప్రారంభమైందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల విద్యార్థులను నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.అనంతరం ఉత్సవ సమితి ప్రతినిధులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ముత్తమ్మ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, బంజారా సంక్షేమ సంఘం, బంజారా ఉద్యోగ సంఘం ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago