Telangana

పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డును తెలంగాణలోనే నంబర్-1గా తీర్చిదిద్దుతాం

రూ.21 కోట్లతో 172 దుకాణాల నిర్మాణం వేగవంతం 

మేకల మండి, చేపల మార్కెట్, స్లాటర్ హౌస్, ఎస్‌టీపీ ప్లాంట్ ఏర్పాటుకు కార్యాచరణ 

అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

వ్యవసాయం, వాణిజ్యం, ఉపాధి రంగాలకు కొత్త ఊపిరి పోస్తూ పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ యార్డును తెలంగాణ రాష్ట్రంలోనే అత్యాధునిక, ఆదర్శ మార్కెట్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రైతులు, వ్యాపారులు, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో మార్కెట్ యార్డు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.గురువారం పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. నిర్మాణాల నాణ్యత, పనుల పురోగతిపై అధికారులను ప్రశ్నించి, నిర్ణీత గడువులోగా అత్యుత్తమ ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో 12 సంవత్సరాల క్రితం పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి దశలవారీగా నిధులు మంజూరు చేస్తూ మార్కెట్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.ప్రస్తుతం 21 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 172 దుకాణాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోందని తెలిపారు. పనులు పూర్తయ్యాక లైసెన్స్ కలిగిన వ్యాపారులకు దుకాణాలను కేటాయించడంతో పాటు కొత్త వ్యాపారులకు కూడా లైసెన్సులు మంజూరు చేసి వ్యాపార విస్తరణకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.ప్రస్తుతం మార్కెట్‌కు పన్నులు, కిరాయిలు, టెండర్ల ద్వారా ఏటా సుమారు రూ.6 కోట్ల ఆదాయం సమకూరుతోందని, దీనిని మరింత పెంచేందుకు కొత్త ఆదాయ వనరులను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మార్కెట్ యార్డులో ఆధునిక మేకల మండి, చేపల మార్కెట్, అత్యాధునిక స్లాటర్ హౌస్, ఎస్‌టీపీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే రోజువారీ కూరగాయల విక్రయాలు నిర్వహించే చిరు వ్యాపారులకు ప్రత్యేక షెడ్లు నిర్మించి మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.మార్కెట్‌లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి పరిశుభ్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.ప్రభుత్వ నిధులతో పాటు మార్కెట్ స్వంత ఆదాయాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ యార్డును తెలంగాణలోనే అత్యుత్తమ, ఆదర్శవంతమైన, నంబర్-1 మార్కెట్‌గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కార్యదర్శి సునీల్, మాజీ డైరెక్టర్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వ్యాపారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago