మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా సయ్యద్ మాజీద్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంగారెడ్డిలో జరిగిన టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా మహాసభలో ఏకాగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి తెలిపారు. ఉపాధ్యక్షులుగా శ్రీనాథ్, ప్రధాన కార్యదర్శులుగా రూమండ్ల అనిల్, బసవేశ్వర్, జాయింట్ సెక్రటరీగా భూపాల్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శిగా శ్రీనివాస్ రెడ్డి లను నూతన కమిటీలో ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంగారెడ్డి జిల్లా మహాసభలో పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన విలేకరులను కీలక పదవులకు ఎన్నికై ప్రత్యేక గుర్తింపు పొందారు. జిల్లా జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వృత్తి గౌరవం కోసం సమిష్టిగా కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. జిల్లా కార్యవర్గ సభ్యుడిగా సయ్యద్ మజీద్ అలీ ఎంపిక కావడం పట్ల పలువురు జర్నలిస్టులు శుభకాంక్షలు తెలిపారు. మాజీద్ అలీ తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా జనరల్ సెక్రెటరీ రూమండ్ల అనిల్ కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి బసవేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనాథ్, జిల్లా కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…