రూ.4.45 కోట్లతో సుందరీకరణ పనులు..
హెచ్ఎండిఏ–సీఎస్ఆర్ నిధులతో బతుకమ్మ ఘాట్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, హరితవనంతో పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దనున్నాం
ప్రజల ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణే లక్ష్యం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
పటాన్‌చెరు పట్టణానికి మరో ఆణిముత్యంగా తిమ్మక్క చెరువు రూపుదిద్దుకోనుంది. రూ.4.45 కోట్ల వ్యయంతో చేపట్టిన సుందరీకరణ పనులు పూర్తయిన తర్వాత ఈ చెరువు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే విహార కేంద్రంగా, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలవనుందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం ఉదయం వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పట్టణ పుర ప్రముఖులతో కలిసి తిమ్మక్క చెరువు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల నాణ్యతపై ఆరా తీస్తూ ప్రతి నిర్మాణం అత్యుత్తమ ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని పరిసరాలు, ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అందించాలన్న సమున్నత లక్ష్యంతో నియోజకవర్గంలోని చెరువులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా తిమ్మక్క చెరువును అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు.
చెరువు అభివృద్ధికి హెచ్ఎండిఏ నుంచి రూ.3.05 కోట్లు, ఏపీఆర్ సంస్థ సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ.1.40 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటికే వాకింగ్ ట్రాక్ నిర్మాణం తుది దశకు చేరుకుందని, త్వరలోనే బతుకమ్మ ఘాట్, ఓపెన్ జిమ్, ఆకర్షణీయమైన స్వాగత తోరణాలు, విశ్రాంతి బెంచీలు, చిన్నారుల ఆట స్థలం, అందమైన ల్యాండ్‌స్కేపింగ్, హరితవనం అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని వివరించారు.అంతేకాకుండా రూ.30 లక్షల వ్యయంతో చెరువు చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు పూర్తయిందని తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత తిమ్మక్క చెరువు ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు వచ్చే ప్రజలకు, కుటుంబ సభ్యులతో విహారానికి వచ్చే వారికి అత్యంత అనువైన ప్రదేశంగా మారుతుందని పేర్కొన్నారు.
అదేవిధంగా సాకి చెరువు, తిమ్మక్క చెరువులను పటాన్చెరు పట్టణానికి శోభాయమానమైన గుర్తింపుగా తీర్చిదిద్ది, ప్రజలు గర్వపడే ప్రజా ఆస్తులుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, హెచ్ఎండిఏ డిఈ రామారావు, ఏపీఆర్ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నర్రా బిక్షపతి, పృథ్వీరాజ్, వెంకటేష్, రాజు, ధనరాజ్ గౌడ్, బోజయ్య, షకీల్, పట్టణ పుర ప్రముఖులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…
ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…