మనవార్తలు , పటాన్ చెరు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేయడంతో క్రీడాకారులు ఉన్నత స్థానాలకు ఎదగుతున్నారని చిట్కుల్ గ్రామసర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్‌ల జ్ఞాపకార్ధం పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామంలో నిర్వహిస్తున్న నీలం మధుముదిరాజ్ కబడ్డీ, వాలీబాల్ ఛాంపియన్ ట్రోపీ పోటీలకు ముఖ్యఅతిధిగా హాజరై సర్పంచ్ మధు ముదిరాజ్ ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అనుమతిలో ఓపెన్ టు ఆల్ టోర్నమెంట్ లు గ్రామపరిధిలో భూలక్ష్మి గుడిప్రక్కన నిర్వహిస్తున్నామని సర్పంచ్ మధు ముదిరాజ్ తెలిపారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలని ప్రతీ ఏడాది ఈక్రీడలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడాకారులకు వీటి ద్వారా రాష్ట్ర, జాతీయస్థాయికి ఎదుగుతారని ఆయన తెలిపారు. క్రీడాకారులు ఉన్నతికి తాను ఎప్పుడూ ముందుంటానని నీలం మధుముదిరాజ్ తెలిపారు .
కబడ్డీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మొదటి బహుమతిగా 50 వేలు నగదు, రెండవ బహుమతి 25 వేల నగదు, మూడు బహుమతి 10 వేల నగదు, నాల్గవ బహుమతి 10 వేల నగదుతో పాటు ట్రోపీలు అందించనున్నామని తెలిపారు. అలాగే వాలీబాల్ పోటీల్లో కూడా మొదటి బహుమతిగా 30 వేల నగదు, రెండవ బహుమతి 15 వేల నగదు, మూడవ బహుమతిగా 5 వేల నగదు, నాల్గవ బహుమతిగా 5 వేల నగదుతో పాటు ట్రోపీలు అందిచనున్నట్లు చెప్పారు. ఈ క్రీడాపోటీల ప్రారంభ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్టువర్ధన్‌రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, వెంకటేష్, క్రిష్ణ, భుజగం, శ్రీను, వెంకటేష్,ఆంజనేయులు, ఎన్‌ఎమ్‌ఎమ్ యువసేన, గ్రామస్తులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…