Districts

అమరులైన వీర జవాన్‌ల జ్ఞాపకార్ధం వాలీబాల్‌ టోర్నమెంట్‌

మనవార్తలు , పటాన్ చెరు

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్రీడలకు పెద్దపీట వేయడంతో క్రీడాకారులు ఉన్నత స్థానాలకు ఎదగుతున్నారని చిట్కుల్‌ గ్రామసర్పంచ్ నీలం మధు ముదిరాజ్‌ అన్నారు. పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్‌ల జ్ఞాపకార్ధం పటాన్‌చెరు మండలం చిట్కుల్‌ గ్రామంలో నిర్వహిస్తున్న నీలం మధుముదిరాజ్‌ కబడ్డీ, వాలీబాల్‌ ఛాంపియన్‌ ట్రోపీ పోటీలకు ముఖ్యఅతిధిగా హాజరై  సర్పంచ్ మధు ముదిరాజ్‌ ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ అనుమతిలో ఓపెన్‌ టు ఆల్‌ టోర్నమెంట్‌ లు గ్రామపరిధిలో భూలక్ష్మి గుడిప్రక్కన నిర్వహిస్తున్నామని సర్పంచ్ మధు ముదిరాజ్‌ తెలిపారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలని ప్రతీ ఏడాది ఈక్రీడలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడాకారులకు వీటి ద్వారా రాష్ట్ర, జాతీయస్థాయికి ఎదుగుతారని ఆయన తెలిపారు. క్రీడాకారులు ఉన్నతికి తాను ఎప్పుడూ ముందుంటానని  నీలం మధుముదిరాజ్‌ తెలిపారు .

కబడ్డీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మొదటి బహుమతిగా 50 వేలు నగదు, రెండవ బహుమతి 25 వేల నగదు, మూడు బహుమతి 10 వేల నగదు, నాల్గవ బహుమతి 10 వేల నగదుతో పాటు ట్రోపీలు అందించనున్నామని తెలిపారు. అలాగే వాలీబాల్‌ పోటీల్లో కూడా మొదటి బహుమతిగా 30 వేల నగదు, రెండవ బహుమతి 15 వేల నగదు, మూడవ బహుమతిగా 5 వేల నగదు, నాల్గవ బహుమతిగా 5 వేల నగదుతో పాటు ట్రోపీలు అందిచనున్నట్లు చెప్పారు. ఈ క్రీడాపోటీల ప్రారంభ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్టువర్ధన్‌రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, వెంకటేష్‌, క్రిష్ణ, భుజగం, శ్రీను, వెంకటేష్‌,ఆంజనేయులు, ఎన్‌ఎమ్‌ఎమ్ యువసేన, గ్రామస్తులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

1 day ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

1 day ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

2 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

2 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

3 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

3 days ago