మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్:
ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణం, యువత ఉత్సాహం, ప్రజల భాగస్వామ్యంతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్,యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ గారు పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మియాపూర్ విలేజ్, మియాపూర్ మీ-సేవా, వడ్డెర బస్తీ, రాచమల్ల కృష్ణ పటేల్ నివాస ప్రాంతం, మియాపూర్ యువశక్తి, వడ్డెర యువజన సంఘం, TN నగర్, అవిగ్నా యూత్ అసోసియేషన్, సాయిరామ్ నగర్, FCI కాలనీ, RBR కాంప్లెక్స్, RBR ఉత్సవ కమిటీ, ప్రజయ్ షెల్టర్స్, ఎంఏ నగర్ , ప్రగతి ఎన్‌క్లేవ్, వినాయక యువజన సంఘం, జనప్రియ వెస్ట్ సిటీ, NYLA గేటెడ్ కమ్యూనిటీ, HMT, కృష్ణ సాయి అపార్ట్‌మెంట్, స్టాలిన్ నగర్,ఉత్సవ్ అసోసియేషన్, మదీనాగూడ హుడా కాలనీ, AB యూత్ అసోసియేషన్, శ్రీరంగాపురం కాలనీ, అరోబిందో కాలనీ, SR Estates తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఆయన సందర్శించారు.
ఆయా ప్రాంతాల్లో గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు మరియు భక్తులతో ఆయన ఆత్మీయంగా ముచ్చటించారు. పలుచోట్ల నిర్వాహకులు, యువత మరియు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. కొన్ని ప్రాంతాల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ గారు సూచించారు.
సంప్రదాయాలను కాపాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భక్తి, సేవ, ఐక్యతతో ఉత్సవాలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాల్లో TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ఇన్‌చార్జ్ శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ గారు, స్థానిక నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువత మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో ప్రజల ఆహ్వానాలను స్వీకరిస్తూ, ఆధ్యాత్మిక మరియు సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ గారు ప్రజలతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి వినాయక చవితి…
గణనాథుడికి ప్రత్యేక పూజలు.. ఎమ్మెల్సీ అంజిరెడ్డి నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: పటాన్‌చెరు నియోజకవర్గంలోని…
ఆతిథ్య ఉపన్యాసంలో భారత-పశ్చిమ ఆసియా విధానంపై కల్నల్ రాజీవ్ అగర్వాల్ మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: పశ్చిమ ఆసియాతో భారతదేశానికి…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ (జీఎస్ఎస్) హైదరాబాదులోని లైఫ్ సైన్స్ విభాగం ‘ఆహార శుద్ధి…
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…