Telangana

గోనేమ్మ బస్తీలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు

గణనాథుడికి ప్రత్యేక పూజలు.. ఎమ్మెల్సీ అంజిరెడ్డి 

నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

పటాన్‌చెరు నియోజకవర్గంలోని గోనేమ్మ బస్తీలో గోనేమ్మ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నవరాత్రుల సందర్భంగా గణనాథుడికి ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత, మహిళలు, కాలనీ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

ఉత్సవాల్లో భాగంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గోనేమ్మ యూత్ సభ్యులు ఎమ్మెల్సీ అంజిరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అలాగే నూతన అధ్యక్షుడిని సైతం యూత్ సభ్యులు ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ గోనేమ్మ బస్తీతో తనకు ఎంతోకాలంగా అనుబంధం ఉందని, బస్తీ ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలంతా ఐకమత్యంతో ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో గోనేమ్మ బస్తీ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. నవరాత్రుల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, తీర్థప్రసాదాల పంపిణీ తదితర ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

కార్యక్రమంలో కోలుకూరి రాజశేఖర్‌రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మున్నూరుకాపు కుల సంఘం ప్రతినిధులు, కాసాల శంకర్,మైలారం సత్య నారాయణ, కాసాల యాదయ్య, నాయకోటి భుపాల్, మేకల జగదీశ్, మహేష్, సతీష్, మేకల నందు,శీను, మిట్టు, గోనేమ్మ యూత్ సభ్యులు, బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

హైటెక్ సిటీలో ‘హైలైఫ్ ఎగ్జిబిషన్’ ప్రారంభం.. తళుక్కుమన్న సినీ తారలు

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నటీమణులు రితు చౌదరి, వర్ష, రుక్సార్ పటేల్ నవంబర్ 15 నుంచి 17 వరకు నోవోటెల్…

25 minutes ago

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…

4 hours ago

బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…

6 hours ago

ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

21 hours ago

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

21 hours ago

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా మహా చండీయాగం

ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…

22 hours ago