Telangana

గీతంలో ఘనంగా విజేతల దినోత్సవం

విద్యార్థులకు నియామక పత్రాల అందజేత

₹1.4 కోట్ల గరిష్ఠ వార్షిక వేతనం

పీఎస్ యూలకు ముగ్గురు ఎంపిక

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని కెరీర్ గైడెన్స్ సెంటర్ (సీజీసీ) మంగళవారం విజేతల దినోత్సవాన్ని (అచీవర్స్ డేని) ఘనంగా నిర్వహించింది. ప్రాంగణ నియామకాలలో ఎంపికైన ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, ఫార్మసీ, సైన్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విద్యార్థులకు నియామక పత్రాలతో పాటు విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించడానికి సీట్లు పొందిన అభ్యర్థులకు ప్రవేశ పత్రాలను అందజేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో దాదాపు 270కి పైగా దేశీయ, బహుళ జాతి కంపెనీలు హైదరాబాదు గీతంలో ప్రాంగణ నియామకాలను నిర్వహించి, బీటెక్, ఎంటెక్, బీబీఏ, బీకాం, ఎంబీఏ, బీ.ఫార్మసీ, బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఏ విద్యార్థులను ఎంపిక చేశాయని, రానున్న రెండు నెలల్లో మరో 40కి పైగా కంపెనీలు ప్రాంగణ నియామకాలు చేపట్టనున్నట్టు గీతం వర్గాలు వెల్లడించాయి. కొంతమంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కోసం దరఖాస్తు చేసుకుని దేశ, విదేశాలలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలలో ప్రవేశార్హత సాధించినట్టు తెలియజేశారు. అలాగే అగ్రశ్రేణి కంపెనీలలో ఇంటర్న్ షిప్ చేసిన పలువురు గీతం విద్యార్థులను ఆకర్షణీయమైన ప్యాకేజీలతో పూర్తిస్థాయి ఉద్యోగులుగా తీసుకున్నట్టు పేర్కొన్నారు.

తొలిసారి, ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) గీతంలో ప్రాంగణ నియామకం చేపట్టి, ముగ్గురు ఈఈసీఈ విద్యార్థులను ఫిక్స్ డ్ టర్మ్ ఇంజనీర్లుగా (E-II గ్రేడ్) ఎంపిక చేసిందన్నారు.ఈ ఏడాది ప్రాంగణ నియామకాలలో స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు ₹1.4 కోట్ల గరిష్ఠ వార్షిక వేతనం పొందగా, బిజినెస్ ₹10 లక్షలు, సైన్స్ ₹16.42 లక్షలు, హ్యుమానిటీస్ ₹8.5 లక్షలు, ఫార్మసీ ₹6 లక్షల గరిష్ఠ వార్షిక వేతనాలు పొందినట్టు వెల్లడించారు. కాగా, గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు ₹6.00 లక్షల సగటు వార్షిక వేతనం పొందగా, స్కూల్ ఆఫ్ బిజినెస్ ₹7.5 లక్షల సగటు వార్షిక వేతనం పొందినట్టు తెలిపారు.లాభదాయకమైన జీతం ప్యాకేజీలను అందించే అగ్ర రిక్రూటర్లు- అమెజాన్ ₹1.4 కోట్ల గరిష్ఠ వార్షిక వేతనం, అట్లాసియన్ ₹60 లక్షల గరిష్ఠ వార్షిక వేతనం, మైక్రోసాఫ్ట్- ₹51 లక్షలు, వర్చుసా ఇంటర్నేషనల్- ₹47.9 లక్షలు, సిలికాన్ ల్యాబ్స్- ₹30.6 లక్షలు, ఫెడరల్ బ్యాంక్- ₹16.42 లక్షలు, అలాగే థాట్ వర్క్స్, ఒరాకిల్, డెలాయిట్, హెచ్ఎస్ బీసీ, డెలివరూ మొదలైనవి ఆకర్షణీయమైన వేతనాలతో గీతం విద్యార్థులను ఎంపిక చేసినట్టు వివరించారు.

సంఖ్యాపరంగా ప్రధాన రిక్రూటర్లు- యాక్సెంచర్-91 మంది గీతం విద్యార్థులను ఎంపిక చేయగా, టెక్ మహీంద్రా-87 మందిని, రినెక్స్ టెక్నాలజీస్-70, ఎర్నెస్ట్ అండ్ యంగ్ జీడీఎస్-54, టీసీఎస్-34, కాగ్నిజెంట్-27 మందిని ఎంపిక చేసినట్టు తెలిపారు.గీతం విజేతల దినోత్సవం ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కాగా, అరబిందో ఫార్మా అసోసియేట్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.సురేష్ కుమార్, ఇనోవాలోన్ మానవ వనరుల విభాగం డైరెక్టర్ పద్మ దుడ్డు, ఇండియా టెక్ ఆక్యూరేట్ సీనియర్ డైరెక్టర్ & జనరల్ మేనేజర్ కార్తీక్ యలమంచిలి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ అని, జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలని విద్యార్థులకు వారు సూచించారు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో నిరంతర వృద్ధికి కట్టుబడి ఉండాలన్నారు.గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి ప్రాంగణ నియామకాలలో ఎంపికైన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తు నాయకులను రూపొందించడంలో అధ్యాపకుల అంకితభావం, కృషిని వారు ప్రశంసించారు. అర్థవంతమైన విజయాన్ని సాధించడంలో విద్య, నైపుణ్యాల పాత్రను వారు ప్రముఖంగా ప్రస్తావించారు.

 

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జి.శివకుమార్, డాక్టర్ దివ్య కీర్తి గుప్తా, డాక్టర్ మోతాహర్ రెజా, డాక్టర్ బందన కుమార్ మిశ్రా, కె.ప్రదీప్ లతో పాటు, ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులు, పలు విభాగాధిపతులు పాల్గొన్నారు. కెరీర్ గైడెన్స్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కె.మమత అతిథులను స్వాగతించగా, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పి.త్రినాథరావు వందన సమర్పణ చేశారు.తమ విద్యార్థులు విద్యా, వృత్తిపరమైన కార్యకలాపాలలో కొత్త ఎత్తులకు చేరుకోవడానికి, వారి నైపుణ్యాలను పెంపొందించడానికి గీతం కట్టుబడి ఉందని ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా చాటి చెప్పింది.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago