మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
కార్మికుల దినోత్సవం సందర్బంగా రాయదుర్గం లోని వైకుంఠ మహా ప్రస్థానం లో పనిచేసేవారందరికీ శాలువాతో సత్కరించిన శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మరియు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కార్మికులు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహా ప్రస్థానంలో పనిచేసేవారందరికీ బహుమతులను మరియు స్వీట్ బాక్స్ లను అందజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ “ప్రతి మనిషి ఆఖరి మజిలీ చావు, అట్టి ఆఖరి గమ్యంలో మీరంతా అందించే సేవలు ఆదర్శప్రాయం అని, అతి ముఖ్యంగా కరోనా సమయం లో మహా ప్రస్థానం సిబ్బంది అందించిన సేవలను ఎప్పటికి మర్చిపోలేమనీ కొనియాడారు. ఒక మనిషి చనిపోతే సొంత కుటుంబికులే రాలేని రోజుల్లో మీరే అన్ని అయ్యి అంత్యక్రియలు చేయడం ఎంతో ఆదర్శం. మీరు అందించే సేవలకు మేము మా తృప్తి కొరకు అందిస్తున్న ఈ చిన్న కానుక”.భవిష్యత్తులో ఏవరికి ఏ అవసరం వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహాప్రస్థానం మేనేజర్ రాజ్ కుమార్, మహా ప్రస్థానం సిబ్బంది మరియు నాయకులు అంజమ్మ, దారుగుపల్లి నరేష్, రమేష్ గౌడ్, శామ్లెట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…