మనవార్తలు , మునిపల్లి:
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ముంబై జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.కర్ణాటక ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ముంబై జాతీయ రహదారిపై అదుపు తప్పి పడిపోవడంతో వెనుక నుంచి వస్తున్న లారీ వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే మునిపల్లి పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…