మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ రాష్ట్రంలోని మహిళా సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ, వారి సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళా బంధు గా పేరు పొందారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రక్షాబంధన్ పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఫ్లెక్సీకి నియోజకవర్గంలోని మహిళా ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు, విద్యార్థిని విద్యార్థులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉన్నత లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని కొనియాడారు. విద్యారంగంలోనూ ప్రభుత్వ గురుకుల, కస్తూరిబా గాంధీ విద్యాలయాలను ప్రారంభించడంతోపాటు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు సైతం ఓవర్సీస్ స్కాలర్షిప్ ను అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, ఎంఈఓ రాథోడ్, మహిళా ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ నీనా చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ ఉపేందర్, టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ప్రతినిధులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…