_దేశానికి దిక్సూచి తెలంగాణ రాష్ట్రం
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు:
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేడు దేశానికి దిక్సూచిగా రూపుదిద్దారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ పార్టీ 21 వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలో పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఉద్యమ పార్టీ యే రాష్ట్ర ఆవిర్భావ అధికార పార్టీ గా ఎన్నిక కావడం టిఆర్ఎస్ పట్ల ప్రజలకు ఉన్న అభిమానాన్ని చాటి చెప్పిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పధంలోకి తీసుకెల్లిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఒకవైపు ప్రభుత్వంతో పాటు మరోవైపు పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని తెలిపారు. అనంతరం పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ప్లీనరీకి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, పటాన్చెరు ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, దశరథ రెడ్డి, విజయ్ కుమార్, బసవేశ్వర్, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…