మనవార్తలు ,శేరిలింగంపల్లి :
త్రివేణి విద్యాసంస్థలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బి మోతి కుమార్, ఏప్రిల్ నెల 5వ తారీకున దక్షిణాఫ్రికాలోని టాంజానియా లో కల మౌంట్ కిలిమంజారో ని దిగ్విజయంగా అధిరోహించి భారతీయ పతాకాన్ని మరియు త్రి వేణి విద్యాసంస్థల పతాకాన్ని దానిపై ఎగరేసి దిగ్విజయంగా తిరిగి హైదరాబాద్ చేరుకున్న సందర్భంలో స్థానిక త్రివేణి మియాపూర్ ప్రాంగణాల్లో అభినందన సభ ఏర్పాటు చేసి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధి గా మియాపూర్ స్టేషన్ సి.ఐ తిరుపతి రావు, విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి లు హాజరై అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతి రావు మాట్లాడుతూ పర్వతారోహణ చేయటం అనేది అద్భుతమైన పట్టుదల కృషి తో మాత్రమే సాధ్యమని ఈ సందర్భంగా ప్రపంచంలో మరిన్ని పేరెన్నికగన్న పర్వతాలను దిగ్విజయంగా అధిరోహించి దేశానికి తాను పనిచేస్తున్న సంస్థకు తన జన్మ స్థలానికి మోతి కుమార్ మరింత పేరు తీసుకు రావాలని ని ఆశిస్తున్నానని అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ కిలిమంజారో పర్వతారోహణ అనేది పర్వతారోహకుల కళ అని కృషి పట్టుదల నిరంతర శ్రమ తో ఈ ప్రయత్నంలో విజయం సాధించడం మాకు గర్వకారణమని భవిష్యత్తులో మోతి కుమార్ చేసే పర్వతారోహణ యాత్రలో మా విద్యాసంస్థల తరఫున సహాయ సహకారాలు అందిస్తామని మోతి కుమార్ మరిన్ని విజయాలు సాధించాలని మా విద్యార్థులకు ఉపాధ్యాయులకు సమాజానికి స్ఫూర్తినిచ్చే పర్వతారోహణ చేసినందుకు మోతి కుమార్ అభినందనీయుడు అని అన్నారు.
ఈ సందర్భంగా మోతి కుమార్ మాట్లాడుతూ నేను తెలంగాణలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి ఔత్సా హిక పర్వతారోహకుడు ని. నేను ప్రస్తుతం దక్షిణాఫ్రికా నుండి ఈ రోజు నా మాతృ గడ్డ తెలంగాణకు వచ్చానని. ఈ సంవత్సరం ఏప్రియల్ 5 న దక్షిణాఫ్రికాలోని ప్రతిష్ఠాత్మక కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి భారతదేశం పైన నా గౌరవానికి ప్రతీకగా భారతీయ జెండా ని, నేను పనిచేస్తున్న , ఎంతో మంది విద్యార్థులకు 28 సంవత్సరాలుగా నిరంతరాయంగా విద్యా సేవ అందిస్తున్న, త్రివేణి స్కూల్స్ యందు గౌరవసూచకంగా త్రివేణి విద్యాసంస్థల జెండాని ప్రతిష్టించడం జరిగిందని, ఈ సందర్భంగా నాకు మద్దతు ఇచ్చిన త్రివేణి స్కూల్ యాజమాన్యానికి,డైరెక్టర్ డా.వీరేంద్ర చౌదరి కి, శ్రేయోభిలాషులకు మిత్రులకు నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సి ఏ సి నట్రాజ్, సి ఆర్ ఓ లు సాయి నరసింహారావు వెంకట్రావు ,సుబ్బారావు సత్తుపల్లి బ్రాంచ్ ప్రిన్సిపల్ వేణు గోపాల్,విద్యాసంస్థల పీఈటీలు
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…