Telangana

ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత.. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరులో అభివృద్ధి పరుగులు 

రెండు కోట్ల 25 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యల పరిష్కారమే అజెండా 

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

నియోజకవర్గ కేంద్రమైన పటాన్‌చెరు పరిధిలోని జెపి కాలనీ, పటాన్‌చెరు డివిజన్లలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు రూపకల్పన చేస్తూ.. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి అంశాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. శనివారం పటాన్చెరు మరియు జేపీ కాలనీ డివిజన్ల పరిధిలోని వివిధ కాలనీలలో రెండు కోట్ల 25 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, యూజీడిలు, వర్షపునీటి కాలువలు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, కాలనీల్లో నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల అవసరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని చెప్పారు.నూతన రహదారుల నిర్మాణంతో రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోతాయని, భూగర్భ డ్రైనేజీ, వర్షపు నీటి కాలువల నిర్మాణంతో మురుగునీరు, వర్షపు నీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని, ప్రజల సహకారంతో ప్రతి కాలనీకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, నర్రా బిక్షపతి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీధర్ చారి, ప్రకాష్ రావు, పృథ్వీరాజ్, వెంకటేష్, ఆశమ్, రామ్మోహన్, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

admin

Recent Posts

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…

3 hours ago

బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…

6 hours ago

ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

20 hours ago

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

21 hours ago

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా మహా చండీయాగం

ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…

21 hours ago

తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం

- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…

21 hours ago