వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
మనవార్తలు ,పటాన్చెరు
పటాన్చెరు పట్టణ పరిధిలోని తిమ్మక్క చెరువును రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 40 లక్షల రూపాయలతో తిమ్మక్క చెరువు చుట్టూ నిర్మించనున్న వాకింగ్ ట్రాక్ పనులకు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్ లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ జిహెచ్ఎంసి పరిధిలోని చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తోందని తెలిపారు.
ఇందులోభాగంగా తిమ్మక్క చెరువు అభివృద్ధికి రెండుకోట్ల రూపాయలు కేటాయించిందని గుర్తు చేశారు. ఇప్పటికే 30 లక్షల రూపాయలతో చెరువు చుట్టూ ఇనుప కంచె నిర్వహించడం జరిగిందని తెలిపారు. 40 లక్షల రూపాయలతో ప్రజల కోసం వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. త్వరలోనే కోటీ 30 లక్షల రూపాయలతో చెరువు కట్ట పై విద్యుత్ స్తంభాలు, పార్కు, కుర్చీలు, ఆర్చి, తదితర సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే పటాన్చెరు లోని సాకి చెరువు సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి అని తెలిపారు. భవిష్యత్తులో సాకిచెరువు, తిమ్మక్క చెరువులు పటాన్చెరు పట్టణానికి శోభాయమానంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, జిహెచ్ఎంసి నీటిపారుదల విభాగం అధికారి శేషగిరిరావు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, ప్రమోద్ గౌడ్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
55 లక్షల రూపాయల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో కొనసాగుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు డివిజన్ తో పాటు పటాన్చెరు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 55 మంది లబ్ధిదారులకు మంజూరైన 55 లక్షల రూపాయల విలువైన చెక్కులను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. ప్రజల కష్టాలను దూరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుదన్నారు. సంక్షేమ పథకాల అమలును చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు చేయడనే పనిగా పెట్టుకున్నాయని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, తెరాస పార్టీ మండల అధ్యక్షులు పాండు, పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…