Districts

టిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు మండల కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్

ప్రతిపక్షాలవి బ్లాక్ మెయిల్ రాజకీయాలు

సమగ్ర వివరాలతో ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టండి

మనవార్తలు,పటాన్చెరు

గ్రామ స్థాయి నుండి ప్రతి కార్యకర్త పార్టీ పటిష్టతకు పని చేస్తూనే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, విజయ గర్జన సభ అంశాలపై శనివారం పాటి గ్రామ చౌరస్తాలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పటాన్చెరు మండల పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణకు ఉద్యమ నాయకుడే తొలి ముఖ్యమంత్రి అయిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని అన్నారు. గత ఏడు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలను ప్రవేశపెట్టారని, ఇకనుండి గ్రామస్థాయి నుండి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారని తెలిపారు. ప్రతిపక్షాల పసలేని విమర్శలను, అసత్య ప్రచారాలను ఆధారాలతో తిప్పికొట్టాలని కోరారు. గ్రామ స్థాయి ప్రజాప్రతినిధి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎవరిని విమర్శించిన పార్టీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని పనిలేదని, ప్రతిపక్షాలకు ఘాటుగా బదులు ఇవ్వాలని కోరారు.

పని చేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందని, క్రమశిక్షణతో పనిచేసినప్పుడే రాజకీయాల్లో ఎదుగుదల సాధ్యమవుతుందని అన్నారు. నవంబర్ 15వ తేదీన వరంగల్ లో నిర్వహించనున్న విజయ గర్జన సభకు ప్రతి గ్రామం నుండి 200 మంది కార్యకర్తలు తరలిరావాలని కోరారు. 2018 లో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు పటాన్చెరు నియోజకవర్గం నుండి రికార్డు స్థాయిలో 40వేల మంది హాజరయ్యారని, అదే స్థాయిలో విజయ గర్జన సభకు హాజరై విజయవంతం చేయాలన్నారు.

అనంతరం మండల పరిధిలోని 19 గ్రామాల టిఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి వెంకట రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీపీలు గాయత్రి పాండు, శ్రీశైలం యాదవ్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకులు మేరాజ్ ఖాన్, అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago