Telangana

పన్ను రేట్లు తగ్గించాల్సిన ఆవశ్యకత ఉంది …

– గీతం జాతీయ సదస్సులో ప్రొఫెసర్ భానుమూర్తి ఉద్ఘాటన

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

వచ్చే బడ్జెట్లో లేదా తదుపరి జీఎస్జీటీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్లను తగ్గించాల్సిన ఆవశ్యకత ఉందని , మరీ ముఖ్యంగా జీఎస్టీ రేట్లు ఖరారయ్యే చోట అని బెంగళూరులోని అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బీఆర్ఎస్ఆర్ భానుమూర్తి అభిప్రాయపడ్డారు . సామాజికాభివృద్ధి మండలి ( సీఎస్ఓ ) దక్షిణాది ప్రాంతీయ కేంద్రం , హైదరాబాద్ సౌజన్యంతో , గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎస్చ్ఎస్ ) హెదరాబాద్ లో గురువారం ‘ భారతీయ నేపథ్యంలో సామాజిక – ఆర్థిక రంగాల నుంచి మహమ్మారి – ఆధారిత సంక్షోభాలకు బహుముఖ ప్రతిస్పందనలు , స్థితిస్థాపకత పై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన కీలకోపన్యాసం చేశారు .

భారత్ పొదుపు – ఆధారిత ఆర్థిక వ్యవస్థ అని , ప్రపంచంలోని అతిపెద్ద పొదుపుదారులలో ఒకటని , ఇతర దేశాలతో పోలిస్తే మనం ఈ విధంగానే బాగా ఎదుగుతున్నట్టు ఆయన చెప్పారు . కానీ , గత రెండేళ్ళగా , చాలా విధాన నిర్ణయాలు పొదుపుకు వ్యతిరేకంగా ఉంటున్నాయన్నారు . మనదేశం 8 లేదా 9 శాతం వృద్ధిని సాధించాలన్నా , లేదా ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నా , స్థూల విధానాలలో పాదుపు అత్యంత ముఖ్యమైనదని , కానీ దాని గురించి ప్రస్తుత విధాన నిర్ణేతలు చాలా తక్కువగా చర్చిస్తున్నారంటూ డాక్టర్ భాను ఆవేదన వ్యక్తం చేశారు . 2003 నాటి ఎస్ఆర్ఎం చట్టాన్ని తిరిగి అమలు చేసేవరకు ప్రజా రుణం 70 లేదా 60 శాతానికి తగ్గడం మనం చూడబోమని ఆయన స్పష్టీకరించారు . పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్ఆర్ఎం చట్టానికి విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలు , వాటి ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారడానికి దారితీస్తోందన్నారు .

దీనికితోడు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పలు రాష్ట్రాలు యోచిస్తున్నాయని , అదే జరిగితే ఇక మన ఆర్థిక వ్యవస్థ గాడిన పడడం కష్టమేనని ప్రొఫెసర్ భానుమూర్తి పేర్కొన్నారు . ‘ కోవిడ్ మహమ్మారి , అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం , భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు’పై జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సూరజిత్ మజుందార్ కీలకోపన్యాసం చేశారు . సదస్సు నిర్వాహకుడు డాక్టర్ మందార్ వి.కులకర్ణి స్వాగతోపన్యాసం చేయగా , సీఎస్ఓకి చెందిన డాక్టర్ సత్యం సుంకర వందన సమర్పణ చేశారు . ఈ ప్రారంభోత్సవంలో గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , ఆంగ్ల విభాగాధిపతి ప్రొఫెసర్ డీఆర్పీ చంద్రశేఖర్ , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు . శుక్రవారం సాయంత్రం వరకు ఈ సదస్సు కొనసాగనుంది .

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago