వర్గ పోరువల్ల నిలిచిపోయిన పలు కాలనిలా అభివృద్ధి
సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల్ బొల్లారం మున్సిపల్ పరిధిలోని 2వ వార్డ్ బీసీ కాలనీలో శుక్రవారం అధికార పార్టీ 2వ వార్డ్ కౌన్సిలర్ వి. గోపాలమ్మ వెంకటయ్య మరియు వార్డ్ ప్రజలు రోడ్లు లేక, నడిచే దారిలో నీళ్లు నిండి నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందని తమ వార్డులో రోడ్లపై వరిమొక్కలను నాటి నిరసన వ్యక్తం చేసారు.
కౌన్సెలర్ గోపాలమ్మ మాట్లాడుతూ పేరుకే మీము అధికార పార్టీ కౌన్సిలర్ కానీ గెలిచి ఇన్ని రోజులు గడిచిన మా వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి చెందలేదని,బీసీ కాలనీలో డ్రైనేజి వ్యవస్థ,రోడ్డు మరియు తాగడానికి మంచినీటి సోక్యారం కూడా లేదని, బొల్లారం మున్సిపాల్లో మా అధికార పార్టీలో రెండు వర్గాలు వున్నామాట నిజమే కానీ అలాంటి వర్గాలు ఏమైనా ఉంటే ఎలెక్షన్ వరకే, ఎన్నికల తరువాత మనం కేవలం బొల్లారం మున్సిపల్ ని ఎలా అభివృద్ధి చెయ్యాలన్నదానిపై ఆలోచించాలి కానీ ఇక్కడ మాత్రం వర్గాలను ద్రుష్టిలో పెట్టుకొని మాకు సంబందించిన వార్డుల్లో అభివృద్ధి చేయడం లేదు. కావున ఇప్పటికైనా వర్గ వేబేదలను పక్కన పెట్టి ప్రజల కోసం పనిచెయ్యాలని మరియు అన్ని వార్డుల్లో ఒకేలా అభివృద్ధి చెయ్యాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు రాజమణి, కృష్ణవేణి, విజయ, శాంత, గీత, సంగీత, మహేశ్వరి,చక్రపాణి, సత్యనారాయణ,వెంకటేష్, నాని, చారి, నాగరాజు మరియు వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…