మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :
పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ మరియు యువజన వికాస సమితి అధ్యక్షులు అడ్వకేట్ విజయ్ కుమార్ ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి శివానందం గారు కృషి చేయాలని ఆకాంక్షించారు. గతంలో సర్పంచ్‌గా పాలన అందించిన అనుభవం ఉన్న శివానందం గారు, ఇప్పుడు పటాన్‌చెరు లాంటి అతిపెద్ద మార్కెట్ కమిటీకి చైర్మన్‌గా ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు.రైతు సంక్షేమమే ధ్యేయంగా, మార్కెట్ కమిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తూ భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిష్టించాలని, ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తనను సన్మానించిన మెట్టు శ్రీధర్ మరియు విజయ్ కుమార్ గారికి చైర్మన్ శివానందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో మార్కెట్ కమిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని అభినందనలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…