Telangana

పట్టభద్రులవుతున్న ఎన్.సీ.సీ. క్యాడెట్లకు ఘన వీడ్కోలు

శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో పట్టభద్రులవుతున్న ఎన్.సీ.సీ. క్యాడెట్లకు గురువారం హృదయపూర్వక వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రీడలు, ఎన్.సీ.సీ. డైరెక్టరేట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో, గీతంతో పాటు, దేశానికి వారు అందించిన ఆదర్శప్రాయమైన సేవ, అంకితభావం, క్రమశిక్షణలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు పట్టభద్రులవుతున్న క్యాడెట్లను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్.సీ.సీ. శిక్షణ యొక్క నిజమైన విలువ కేవలం ‘సి’ సర్టిఫికేట్ సంపాదించడం వరకే పరిమితం కాదని చెప్పారు. ‘ఇది మీకు స్థైర్యం, క్రమశిక్షణ, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ గుణాలే దేశానికి అర్థవంతంగా సేవ చేసేందుకు మీకు మార్గదర్శకంగా ఉంటాయి’ అని అన్నారు.

రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ గౌరవ అతిథులుగా హాజరై, పట్టభద్రులవుతున్న క్యాడెట్ల అంకితభావాన్ని, వారి సేవను ప్రశంసించారు.ఈ సందర్భంగా, అసోసియేట్ ఎన్.సీ.సీ. ఆఫీసర్ (ఏ.ఎన్.ఓ) లెఫ్టినెంట్ ఎస్. అజయ్ కుమార్ తన శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి, లాంఛనంగా ఆ హోదాను స్వీకరించినందుకు అతిథులు ఆయనను అభినందించి, సత్కరించారు.ఈ కార్యక్రమంలో, పట్టభద్రులవుతున్న క్యాడెట్లు తమ ఎన్.సీ.సీ. ప్రస్థానం ఎంత గొప్పదో పంచుకోగా, జూనియర్ క్యాడెట్లు తమ కృతజ్జతలు, అభినందనలను తెలియజేశారు. పట్టభద్రులవుతున్న క్యాడెట్లకు జ్జాపికలను అందజేశారు.

ఎన్.సీ.సీ. విజయాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ప్రత్యేకంగా రూపొందించిన వీడియో, అలాగే మరపురాని క్షణాలను చిత్రీకరించిన ఆడియో-విజువల్ ప్రజెంటేషన్, ఈ కార్యక్రమానికి గత స్మృతులను జోడించాయి. క్యాడెట్లు ప్రదర్శించిన శాస్త్రీయ సంగీత ప్రదర్శనలు, ఆసక్తికరమైన కార్యకలాపాలు ప్రేక్షకుల మన్ననలను పొందాయి.సీనియర్ క్యాడెట్ల వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది. అనంతరం గ్రూపు ఫోటో, విందుతో ఈ చిరస్మరణీయ వేడుక ముగిసింది.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

11 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

11 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

11 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago