ప్రజలు కాంగ్రెస్ ను నమ్మేపరిస్థితి లేదు బీఆర్‌ఎస్ పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి

politics Telangana

 

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం :

తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్‌ఎస్ పార్టీ పోషించిన పాత్ర చారిత్రాత్మకమని పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి అన్నారు .భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదర్శ్ రెడ్డి హాజరైయ్యారు .సండే మార్కెట్ బాలవిహార్ పార్క్ వద్ద టౌన్ ప్రెసిడెంట్ ఆలూరి గోవింద్ పార్టీ జెండాను ఆవిష్కరించారు . అనంతరం పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు దిగుతున్నాయి. ప్రజలను మోసం చేయడం తప్ప వారి దగ్గర చెప్పడానికి ఏమీ లేదు” అంటూ మండిపడ్డారు.ఉద్యమ దశ నుంచి పరిపాలన దశ వరకు పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ముందంజలో ఉందని అన్నారు. సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల అభివృద్ధి, రైతు సంక్షేమం వంటి అంశాల్లో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచిందని ,పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో గత పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, గ్రామీణాభివృద్ధి నుంచి పట్టణ అభివృద్ధి వరకు అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధించామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మరింత బలపడుతూ ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని ఎన్నికల సమయంలో గ్రూపు విభేదాలకు తావు లేకుండా, అందరూ ఒకే తాటిపై నడవాలని ఆదర్శ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, కుమార్ గౌడ్, ఐలేష్, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్, క్రాంతి, లక్ష్మీనారాయణ, కృష్ణకాంత్, నరసింహ, వెంకటేష్, పెద్ద రాజు, పరమేష్ తదితరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *