_ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 45 గ్రామ పంచాయతీలకు 5 కోట్ల 25 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, వీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులకు సూచించారు. శుక్రవారం పటాన్చెరులోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన ఉపాధి హామీ పథకం నిధుల వినియోగంపై ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా అందించే నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి ఖర్చు చేయాలని కోరారు. ప్రధానంగా సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు వెచ్చించాలని సూచించారు. దీంతోపాటు 9 నూతన గ్రామపంచాయతీలలో పంచాయతీ భవనాల నిర్మాణ పనుల కోసం 20 లక్షల రూపాయల చొప్పున ఒక కోటి లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసే నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…