పటాన్ చెరు
వచ్చేనెల ఆగస్టు 1వ తేదీన పటాన్ చెరు డివిజన్ పరిధిలో బోనాల పండుగ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
ఆదివారం ఉదయం పట్టణంలోని శ్రీ కోదండ సీతారామ స్వామి దేవాలయంలో బోనాల పండగ పై స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధ్యక్షతన పుర ప్రముఖుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు ఆగస్టు 1న బోనాల పండుగ తేదీని నిర్ణయించినట్లు తెలిపారు. నాలుగు శతాబ్దాలుగా అన్ని వర్గాలను, విభిన్న సంస్కృతులను ఏకం చేసే మహోన్నత చారిత్రక, సాంస్కృతిక, సామూహిక ఉత్సవంతో భక్తులు పరవశించిపోతున్నారని, తెలంగాణ సాంస్కృతి వైభవాన్ని ప్రతిభింభించేలా బోనాల ఉత్సవాలకు అందంగా ముస్తాబైంది. గతేడాది కోవిడ్ కారణంగా నిరాడంబరంగా జరిగిన వేడుకలు ఈ సారి ఘనంగా జరిపేలా చూడాలని శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పండుగ నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన్ దేవ్, పట్టణ ప్రముఖులు మనోహర్ రెడ్డి, మాణిక్యం, తులసి దాస్, విజయ్ కుమార్, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…