పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ సెస్త్రిలోని భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ యేడాది అక్టోబర్ 11-13 తేదీలలో ఘనీభవించిన పదార్ధ భౌతిక శాస్త్రంలో పురోగతి’ అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఆధునిక ఘనీభవించిన పదార్ధ భౌతిక శాస్త్రంలో ముఖ్యమైన, తాజా పరిణామాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్ననిపుణులు ఒకరికొకరు తెలియజేసుకునే క్రియాశీల వేదికను అందించడం, ప్రస్తుత పరిశోధనలోని ఆసక్తికర అంశాలు, వినూత్న ఆలోచనలను పరస్పరం మార్పిడి చేసుకోవడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఘనీభవించిన పదార్థ పరిశోధనలో భవిష్యత్తు పోకడలపై దృక్పథాన్ని అందిస్తుందని, సంభావ్య సహకారాన్ని,పెంపొందించే అవకాశాలను శోధించేలా ఈ సదస్సు ప్రేరేపిస్తుందన్నారు. అనుభవజ్ఞుల స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఉంటాయని, యువ శాస్త్రవేత్తల గోడ పత్రికల ప్రదర్శన (పోస్టర్ ప్రెజెంటేషన్) కూడా ఉంటుందని తెలిపారు. ఈ సదస్సులో పత్ర సమర్పణ ఆగస్టు 25న తేదీలోగా చేయొచ్చని, నాణ్యమైన పరిశోధనా పత్రాలను ఎంపిక చేసి క్షుణ్ణంగా సమీక్షించిన ప్రొసీడింగ్ లో ప్రచురిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు. https://forms.qle/s.ikeDxwwpUjfsoCkg లింక్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. ఇతర వివరాల కోసం సదస్సు నిర్వాహకుడు డాక్టర్ ఐవీ సుబ్బారెడ్డి 96181 77690ని సంప్రదించాలని,icacmp 2023@gitam.eduకు ఈ-మెయిల్ చేయాలని, లేదా www.gitam.edu/ CACMP2023 ని సందర్శించాలని సూచించారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…