Telangana

ముందుగా మనం భారతీయులం

గీతం ఫెస్ట్ లో ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

మనం ఏ ప్రాంతం, కులం, భాష ఏదైనా, ముందుగా మనమంతా భారతీయులమని, అది నేటి యువత గుర్తెరిగి మసలుకోవాలని ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను హితబోధ చేశారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న వార్షిక వేడుక ప్రమాణ-2026 ప్రారంభోత్సవంలో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతీయులుగా మనమంతా గర్వించాలని, ప్రపంచానికే దారిచూపిన, దిశా-నిర్ధేశనం చేసిన దేశం మనదన్నారు. రాళ్ళను నీటిపై తేలేలా చేసినా, నీటితో దీపాలు వెలిగించినా, రాళ్ళలో నుంచి రాగాన్ని పలికించినా.. అది భారతీయులకే సాధ్యమని చెప్పారు. మన విశ్వగురువుగా ఎదుగుతున్నామంటే, దానికి కారణం మన సంస్కృతి, ధర్మమని ఆయన పేర్కొన్నారు.

ఆధునిక పోకడలు (ట్రెండ్) ఆకర్షిస్తున్నా, మన ఆలోచనా ధోరణి (మైండ్ సెట్) మారకూడదని, మన సంస్కృతి, విలువలను మరువకూడదని విద్యార్థులకు బోయపాటి హితవు పలికారు. తల్లిదండ్రులు, గురువులను మరవొద్దని, నమ్ముకున్న ఆశయాన్ని వదలొద్దని, అవరోధాలు ఎదురైనా ముందడుగే వేయాలని, వైఫల్యాలకు వెరవొద్దని సూచించారు. అప్పుడే మంచి భవిష్యత్తు సాధ్యపడుతుందని చెప్పారు. చదువు వల్ల సంస్కారం అలవడాలని, అహంకారం (ఈగో), ఒత్తిడి (స్ట్రెస్), లేదా మాదక ద్రవ్యాల (డ్రగ్స్) వంటి దురలవాట్లు కాదని స్పష్టీకరించారు. ‘కల్తీకి ఏదీ అనర్హం కానట్టు’ వ్యవస్థ తయారైందని, చివరకు మనం తినే పళ్ళు కూడా కల్తీ కావడం పట్ల ఆయన విచారం వెలిబుచ్చారు. యువత సంఘటితమై, నడుం బిగించి కల్తీ నిరోధానికి ఉద్యుక్తులు కావాలని బోయపాటి సూచించారు.

సెల్ ఫోన్ చేతులో ఉన్న ప్రతి విద్యార్థి ముంగిట యావత్తు ప్రపంచం ఉంటుందని, ఆ జ్జానాన్ని సద్వినియోగం చేసుకోవాలే తప్ప, అది ప్రగతికి ప్రతిబంధకంగా మారకూడదని బోయపాటి శ్రీను హెచ్చరించారు. అలాగే అందివస్తున్న అధునాతన సాంకేతికత, కృత్రిమ మేధస్సు (ఏఐ) రెండువైపులా పదునున్న కత్తి వంటిదని, దాన్ని మన పురోగతికే జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. అలాగే సామాజిక మాధ్యమం (సోషల్ మీడియా) ఎంతవరకు వాడాలనే దానిపై ప్రతి విద్యార్థికీ ఓ అవగాహన ఉండాలని పేర్కొన్నారు.

గీతం, హైదరాబాదు ప్రాంగణానికి, తనకూ అనుబంధం ఇప్పటిది కాదని, అఖండ-1 చిత్రంలోని ఓ పాటను ఇక్కడే చిత్రీకరించామని, అప్పటినుంచి ఈ ప్రాంగణం తనదిగా మారిపోయిందని బోయపాటి చెప్పారు. ఇదే సమయానికి మరో కార్యక్రమం ఉన్నా, కేవలం గీతంతో ఉన్న అనుబంధమే ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసిందన్నారు. మున్ముందు ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా, వీలునుబట్టి తప్పనిసరిగా పాల్గొంటానని ఆయన హమీ ఇచ్చారు. ఇక ఆయనను వేదికపైకి ఆహ్వానిస్తూ, విద్యార్థి సంధానకర్తలు చేసిన సంభాషణపై వివరణ ఇస్తూ, గాలిలో సుమోలు లేచినా, నిజమైన యుద్ధ ట్యాంకు పైనుంచి హీరో దిగినా, ఆయా పాత్రలు, సన్నివేశాలు, సందర్భం, నేపథ్యానికి తగ్గ భావోద్రేకాలను (ఎమోషన్స్) చూపడానికేనని బోయపాటి స్పష్టీకరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు, ప్రముఖ నేపథ్య గాయని గీతామాధురి పాటల కచేరీ, ది డెక్కన్ ప్రాజెక్ట్, ది హెడ్ లైనర్ బ్యాండ్, DJ NANDZY యొక్క హై-ఎనర్జీ డీజే సెట్ వంటివి విద్యార్థులను అలరిస్తున్నాయి.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago