Telangana

పేదింట దీపావళి వెలుగులు నింపిన ఘనత కాంగ్రెస్ పార్టీదే : నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల ఇంట్లో *మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు*..

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం..

నాగమణి కుటుంబంలో ఆనందాల దీపావళి..

నాగమణి కుటుంబసభ్యులతో కలిసి దీపాలు వెలిగించి, టపాసుల కాల్చిన నీలం..

పేదల ముఖాల్లో చిరునవ్వులే ప్రభుత్వ విజయానికి నిదర్శనం..

ప్రజా సంక్షేమానికి సీఎం రేవంత్ పెద్దపీట : మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ 

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయడం అభినందనీయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆదివారం దీపావళి సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తన స్వగ్రామం చిట్కుల్ 4 వ వార్డులో గౌండ్ల నాగమణి గారికి మంజూరు అయిన ఇందిరమ్మ ఇoట్లో నిర్వహించిన మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై వారితో కలిసి కొత్త ఇంటిలో దీపాలు వెలిగించి టపాసులు కాల్చి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాగమణి కుటుంబానికి నూతన వస్త్రాలు పెట్టి, మిఠాయిలు తినిపించి టపాసులు కాల్చిన నీలం.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సొంతింటి కల నెరవేరుతుందో లేదోనని ఎదురుచూసిన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కొత్త ఆశలు కల్పించిందన్నారు.

పేద కుటుంబం కొత్త ఇంటిలో దీపాలు వెలిగిస్తూ దీపావళి జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి నిదర్శనం అని కొనియాడారు. ఈ పథకం అమలుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఈ ఏడాది తమ కుటుంబానికి దీపావళి మరింత ప్రత్యేకమైందని నాగమణి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. నీలం మధు ముదిరాజ్ ఈ సందర్బంగా నాగమణి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపల్ కమీషనర్ వెంకట కిషన్, కౌన్సిలర్స్ నీలం కవిత ముదిరాజ్, సంగన్నగారి జ్యోతిగోపాల్, సంతోషదస్తగిరి, మన్నే రాఘవేంద్ర,సంపత్ రెడ్డి, నారాయణదాసు, మణికంఠ, సందీప్ గౌడ్, నాయకులు నారాయణ రెడ్డి, లక్దారం మల్లేష్, ముత్తంగి అశోక్, అజ్జు, సుంకరి యాదయ్య, ముత్యాలు, శ్రీను, విష్ణు, శ్రీను అప్పా, సంగన్నగారి శ్రీను, ప్రవీణ్, రంజిత్, గ్రామస్థులు, కాంగ్రెస్ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…

3 hours ago

బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…

6 hours ago

ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

20 hours ago

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

21 hours ago

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా మహా చండీయాగం

ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…

21 hours ago

తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం

- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…

21 hours ago