హైదరాబాద్
చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన భారత ప్రభుత్వ జాతీయ అవార్డు గ్రహీతలు కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్, గజం భగవాన్ మరియు మెరిట్ సర్టిఫికెట్ విజేతలు సాయిని భారత్, దుద్యాల శంకర్, తడక రమేష్ గార్లను చేనేత మంత్రి కేటీఆర్ గారు అసెంబ్లీ లోని తన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ తమ వృత్తి నైపుణ్యంతో తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరుప్రఖ్యాతి తెచ్చిన అవార్డు గ్రహితులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం గర్వించదగ్గ చేనేత కళాకారులు తెలంగాణ రాష్ట్రం సొంతమని వారికి ప్రభుత్వపరంగా ప్రోత్సాహం ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చేనేత పథకాల వలన చేనేత రంగం అభివృద్ధి చెందుతుందని, చేనేత కళాకారుల సంక్షేమం కొరకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్. రమణ, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి కర్నాటి విద్యాసాగర్, జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేత తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…