Telangana

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తట్టేడు మట్టి తీయలె బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తట్టేడు మట్టి తీయలేదని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని శివనగర్ నుంచి పెద్ద కంజర్ల వరకు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 3 యేండ్లు గడుస్తున్నా పటాన్‌చెరు నియోజకవర్గంలో కనీసం ఒక్క అభివృద్ధి పనైనా జరగలేదని, కనీసం “తట్టెడు మట్టి కూడా తీయలేదని  విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించి మోసం చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు.
​అధ్వానంగా మారిన రోడ్ల వల్ల స్థానికులు, పాఠశాల విద్యార్థులు పడుతున్న నరకయాతన ప్రభుత్వాలకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్‌కు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. తక్షణమే శివనగర్ – పెద్ద కంజర్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, లేనిపక్షంలో ప్రజలను సమీకరించి ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో బీజేపీ జిన్నారం మున్సిపాలిటీ అధ్యక్షులు జగన్ రెడ్డి, జిన్నారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…

3 hours ago

బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…

6 hours ago

ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

20 hours ago

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

21 hours ago

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా మహా చండీయాగం

ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…

21 hours ago

తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం

- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…

21 hours ago