5000 మంది భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ,
వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనానికి శోభాయాత్ర ఏర్పాట్లు.
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్‌పూర్ బీరంగూడ శివాలయం ఎక్స్ రోడ్డు ఆవరణలో కొలువుదీరిన వరసిద్ధి వినాయకుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంతోషంలో భాగంగా శశిధర్ రెడ్డి (అమీన్‌పూర్ కాంగ్రెస్ నాయకులు), ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మరియు కమిటీ ప్రతినిధులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉత్సవాలలో భాగంగా భక్తుడు ఏ ఈ మణికంఠ సౌజన్యంతో సుమారు 5,000 మంది భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వయంగా భక్తులకు అన్నదానం చేశారు.ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం రోజున కళాకారుల ఆటపాటలు, డప్పు వాయిద్యాల నడుమ నభూతో నభవిష్యత్ అన్నట్లుగా గణేష్ శోభాయాత్ర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మహిళలు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
-అక్టోబర్ 7న సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలు -మహాసభలకు హాజరు కావాలని డీజెఎఫ్ నాయకుల ఆహ్వానం మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: వినాయన చవితి ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ న కాలనీల్లో కాలనీల్లో ఆధ్యాత్మిక…
నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు.. 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం.. జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జిల్లా…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ)…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి వినాయక చవితి…
మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక…